ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్ బైక్‌పై ప్రగతి భవన్‌కు వచ్చారు. మంగళవారం ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై తెరాస అధినేత కేసీఆర్‌తో చర్చించడానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. ‘దేవుడి ఆశీస్సులతో ఎవరి మద్దతు లేకుండా తెరాస ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మజ్లిస్ తెరాసకు మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేస్తూ ఈ సమావేశానికి వచ్చే ముందు ట్వీట్ చేశారు. జాతి నిర్మాణంలో ఇది తొలి అడుగని, తాను తెలంగాణ కేర్‌టేకర్ సీఎం కేసీఆర్‍ని కలవబోతున్నట్లు పేర్కొన్నారు. హంగ్ వస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫలితాలు వెలువడే క్రమంలో కేసీఆర్‌తో ఒవైసీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్… ఎంఐఎం పార్టీని పక్కనబెడితే తెరాసకు మద్దతివ్వడానికి తమకు అభ్యంతరం లేదని ప్రకటించడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒంటరిగా తానే స్వయంగా బుల్లెట్ నడుపుకుంటూ ప్రగతి భవన్ కి అసదుద్దీన్ రావడంపై రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది