SBI Raksha Bandhan offer : రక్షా బంధన్ కి స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్..!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. రక్షా బంధన్ సందర్భంగా  స్టేట్ బ్యాంక్ ఆఫర్లని ప్రకటించింది.   ఇక SBI Raksha Bandhan | YONO SBI APP offer కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

SBI Raksha Bandhan offer | YONO SBI APP

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 20 శాతం డిస్కౌంట్ ని కస్టమర్స్ కి ఇస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ ని ప్రోత్సహించాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఆఫర్లకి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. ఫెర్న్స్ యన్ పెటల్స్ నుండి కొనుగోలు చేస్తే కస్టమర్లు 20 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది. అయితే యోనో యాప్ ద్వారా షాపింగ్ చేసిన వారికి మాత్రమే ఈ అవకాశం.

అలానే జీవన్‌శైలి స్టోర్.కామ్ నుండి వస్తువుల కొనుగోలుపై కూడా 60% వరకు తగ్గింపు అందుకోవ్చని SBI తెలిపింది. అదే విధంగా లగ్జరీ వస్తువులు, ఫ్యాషన్ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. యోనో యాప్ ద్వారా చెల్లింపులు చేస్తే 5 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది.

ఒకవేళ ఈ ఆఫర్స్ గురించి సందేహాలు ఉంటే SBI YONO, sbiyono.sbi అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎస్బీఐ సూచించింది. యోనో SBI యాప్ లేని వారు sbiyono.sbi/index.html ఈ లింక్ తో యాప్ ను డౌన్ లోడ్ చెయ్యచ్చు. ఆగస్టు 22 వరకు మాత్రమే ఈ అఫర్ ఉంటుంది. SBI20 కోడ్ ఉపయోగించి షాప్ చేస్తే డిస్కౌంట్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version