భక్తులతో కిటకిటలాడుతున్న అయోధ్యాపురి….. బాలరాముడిని దర్శించుకున్న 3 లక్షల మంది భక్తులు

-

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరం భక్తజన సందోహంగా మారింది. నూతనంగా నిర్మించిన రామ మందిరం లో బాల రాముడి రూపంలో శ్రీరాముడు కొలువు ఈరోజు నుంచి శ్రీరాముని దర్శించుకోవడానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్నారు. బలరాముని రూపంలో ఉన్న శ్రీరాముని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. భక్తులు తెల్లవారుజామున మూడు గంటలకే రామ మందిరం వద్దకు ఉదయం 7 గంటల నుంచి రామ మందిరంలోకి అనుమతి ఇవాళ ఫస్ట్ రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో బాల రాముని ఇప్పటివరకు 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మరో మూడు లక్షల మంది దర్శనం కోసం వేచి ఉన్నట్లు చెప్పారు. శ్రీరాముని దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.రద్దీని అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా కష్టపడుతున్నారు.వంద ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది భారతీయుల కల సాకారమైంది.

 

 

మరోవైపు బాలరాముడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిపోయింది. ఈ క్రమంలో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. రద్దీని అదుపుచేసందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో రాములోరి దర్శనానికి సమయం పడుతుండటంతో భక్తులు సహనం కోల్పోతున్నారు. ఈ క్రమంలో అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ (security) సిబ్బందిని తోసుకుంటూ ఆలయంలోకి దూసుకెళ్తున్న దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. అయితే, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version