మదర్ థెరిసా అవార్డు అందుకోనున్న లారెన్స్

-

ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్, నటుడు అయిన రాఘవ లారెన్స్  మదర్ థెరిసా అవార్డు పురస్కారాన్ని అందుకోనున్నారు. మదర్ థెరిసా 108వ జయంతిని పురస్కరించుకుని చెన్నైలోని మదర్ థెరిసా ఛారిట్రబుల్ ట్రస్టఓ నిర్వాహకులు ఈ అవార్డుతో లారెన్స్ ను సత్కరించనున్నారు. విశ్వశాంతికై పాటుపడటం, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం వంటి నిస్వార్థ సేవలకు గాను ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారని తెలిపారు. గురువారం చెన్నైలోని తేరనాపేటలోని కామరాజర్ ఆవరణలో జరగనున్న కార్యక్రమానికి పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇతర నేతలు పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news