పలుకుబడి కోసం పిటిషన్లు వేస్తే ఎలా?

-

తెలంగాణలో  ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నమోదైన పిటిషన్ని హైకోర్టు తిరస్కరించింది. తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లడంపై న్యాయవాది రాపోలు భాస్కర్ గత వారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్లో పేర్కొన్న అంశాలను పరిశీలించిన హైకోర్టు పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తేల్చిచెప్పింది.

ఎక్కడా కూడా  రాజ్యాంగానికి ఆటంకం కలిగించే అంశాలు పిటిషన్లో పేర్కొనలేదు.. చట్టాలను ఉల్లంఘించినట్లు ఎక్కడా కనిపించలేదని.. పిటిషన్లో పేర్కొన్న అంశాలు విచారణ చేపట్టే విధంగా లేవన్నారు.. ఉద్దేశపూర్వకంగా  రాజకీయ పలుకుబడి కోసమే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని ధర్మాసనం పేర్కొంది.

హైకోర్టు తీర్పుతో తెరాస వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పు విపక్షాలకు చెంపపెట్టులాంటిదని తెరాస నేతలు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news