వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్ లో సురేష్ రైనా సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రైనా ఐపీఎల్ లో వేలాది పరుగులు చేసిన సంగతి మనకు తెలిసిందదే. ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుకి మెంటర్ గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. 2021 తర్వాత నుంచి రైనా ఐపీఎల్ కి దూరంగా ఉంటున్నాడు. లక్నో టీం మెంటర్ గా ఉన్న గౌతం గంభీర్ మినీ వేలానికి ముందే కోల్కత్తా నైట్ రైడర్స్ లో చేరాడు. దీంతో ప్రస్తుతం లక్నో టీం మెంటర్ పదవి ఖాళీగా ఉంది.
అయితే గంభీర్ స్థానంలో లక్నో టీం మెంటార్గా రైనాను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే 2021 తర్వాత బీసీసీఐ నుంచి ఎన్ఓసి సర్టిఫికెట్ తీసుకొని ఇతర లీగులు యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్, లెజెండ్స్ లీగ్ క్రికెట్ వంటి టోర్నీల్లోనూ రైనా ఆడాడు.బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇతర లీగ్ లలో ఆడిన అటువంటి ఇండియన్ ప్లేయర్స్ కి ఐపీఎల్ టోర్నీలో ఆడే అవకాశం లేదు.