మూడు రోజుల కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు

-

సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనను మూడు రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు.3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనున్నారు అధికారులు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు ఉమా మహేశ్వరరావుతో పాటు మరికొంత మంది అవినీతి అధికారుల పేర్లు, అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపెడే అవకాశం ఉంది.

సీసీఎస్‌లో హైప్రొఫైల్ కేసులనే ఉమామహేశ్వర్ రావు టీమ్‌ టార్గెట్‌ చేసినట్లు ,ఇంకా చాలా కేసుల్లో సెటిల్‌మెంట్‌ చేసేందుకే ఉమామహేశ్వర్‌ రావు ప్రయత్నించినట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు ఏసీబీ అధికారులు. కొంత మంది పోలీస్‌ అధికారులు ఉమామహేశ్వర్‌రావు అవినీతికి సహకరించినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news