యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఈ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా?

-

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయి ఒక్కో సినిమాతో తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు..భారీ సంఖ్యలో ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. అతనికి ఇలాంటి టాలెంట్ కూడా ఉందా అని ఆయన అభిమానులు సంతోష పడతారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాడ్మింటన్ అద్భుతంగా ఆడతారట. ఆయన క్రికెట్ ఆడతారనే సంగతి తెలిసిందే. కానీ ఆయన ప్రొఫెషనల్స్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా బ్యాడ్మింటన్ ఆడతాడట.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర . ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది.అలనాటి నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్,రమ్యకృష్ణ, చైత్ర రాయ్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు . ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news