సీఎం పదవి కోసం హరీష్ రావు రూ.5 వేల కోట్లు సిద్ధం చేసుకున్నారు – జగ్గారెడ్డి

-

బీఆర్ఎస్ నేతలపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేటీఆర్,హరీష్ రావు పెద్ద డ్రామా ఆర్టిస్టులు అని సంచల ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలు చేస్తుంటే హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు హరీష్ రావు ముఖ్యమంత్రి పదవి కోసం రూ.5 వేల కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఎక్కడ దాచిపెట్టారో బయటకి తీయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తా అని అన్నారు. ఒక్కరిని కూడా వదిలి పెట్టబోమని.. కేసిఆర్ హయాంలో అవినీతికి పాల్పడిన అందరి భాగోతం బయట పెడుతామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

 

అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులు వేల కోట్లు దాచిపెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్‌కి తెలివి లేదని , ఇంకోసారి బాల్క సుమన్ మాట్లాడితే డైరెక్ట్‌గా వెళ్లి కొడతామని హెచ్చరించారు. తిట్ల పురాణానికి కేసీఆర్ గురువు అయితే.. కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్‌కే గురువులు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news