బీజేపీపై శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే మాల్దీవులతో ప్రధాని మోడీ గొడవపడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సొంత సైన్యం, పోలీసు బలగాలు లేని మాల్దీవులతో బిజెపి ప్రభుత్వం పోరాడుతోందన్నారు. మాల్దీవులతో వివాదాలను పెంచి వచ్చిన సానుభూతితో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలని బిజెపి ప్రభుత్వం చూస్తుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
చైనాతో చెలగాటమాడే ధైర్యం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు లేదు అని సంజయ్ రౌత్ అన్నారు. బిజెపి చేసే రాజకీయాలు కేవలం వారి స్వార్థం కొరకే అని ఆయన విమర్శించారు. రామాలయ ప్రారంభ ఉత్సవానికి ఆహ్వానం అందలేదని శివసేన చేసిన ఆరోపణలకు సమాధానం ఇస్తూ రాముడు బిజెపి ప్రైవేట్ ఆస్తి కాదు అని ఆహ్వానం అందిన అందకపోయినా ఎవరైనా కార్యక్రమానికి వెళ్లవచ్చని ఆయన స్పష్టం చేశారు.గుడి కట్టాలనే చర్చ జరిగిన చోట గుడి కట్టక ఏళ్ల తరబడి వివాదం ఉన్న స్థలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో రామ మందిరాన్ని బిజెపి నిర్మించినట్లు సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ విషయంపై బిజెపి సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.