రాష్ట్రంలో ఇక నూతన విద్యుత్ పాలసీ… అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

-

ఇవాళ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో విద్యుత్ శాఖపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… రాష్ట్రంలో అతి త్వరలో నూతన విద్యుత్ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సరఫరాపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి శాసనసభలో కూలకశంగా చర్చించిన తరువాత కొత్త పాలసీ రూపొందిస్తామని అన్నారు. అదేవిధంగా, ఆరు గ్యారంటీల్లోని ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పంపిణీతో పాటు రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ పై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

తెలంగాణ ఏర్పాటైన తరువాత 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ),విద్యుత్తు కంపెనీలకు మధ్య జరిగిన ఒప్పందాలు, ఆ ఒప్పందాల్లోని అంశాలు, విద్యుత్తుకు చెల్లించిన ధరలు మొదలైన వాటిపై సమగ్రంగా అధ్యయనం చేసి, పూర్తి వివరాలను అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్థిక సంవత్సరాల వారీగా జరిగిన ఒప్పందాలను, అలాగే అందులోని అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.విద్యుత్ ను తక్కువ ధరకు ఇచ్చే కంపెనీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల విద్యుత్ పాలసీలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news