రౌడీలు ఏపీ బయటే ఉండాలి…చంద్రబాబు

-

కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చిన.. పోలీస్ కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాల ఏర్పాట్లు చేస్తుందన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంతో పోలీసుల పాత్ర వెలకట్టలేనిది…   ప్రాణాలు అడ్డుపెట్టి ఎర్రచందనాన్ని పోలీసులు కాపాడుతున్నారన్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌, ఇన్విజిబుల్‌ పోలీస్‌ విధానం అవలంభించాలన్నారు. ప్రతి పోలీస్‌కు ప్రమోషన్‌ వచ్చేలా విధానం రూపొందిస్తున్నామన్నారు. ప్రతి పీఎస్‌కు ఒక ఆధునిక వాహనం అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.  పోలీస్‌ సంక్షేమం కోసం రూ.15 కోట్లు కేటాయించామన్నారు. రాజధాని పరిధిలో 2500 మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం జరుపుతామని, అమరావతిలో పోలీసు అమరవీరుల స్థూపం నిర్మాణం జరుపుతామని సీఎం పేర్కొన్నారు.  పోలీస్‌ కుటుంబాల సంక్షేమం బాధ్యత నేను చూసుకుంటా.. ప్రజల సంరక్షణ బాధ్యత పోలీసులు చూసుకోవాలని కోరారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించామని ఆయన వివరించారు.

గుండాగిరి, రౌడీజం చేసే  వారు ఏపీలోకి అడుగుపెట్టాలంటేనే భయపడే విధంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఆర్థిక నేరగాళ్లను కట్టడి చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news