బిగ్ బాస్ టైటిల్ వెనక్కిచ్చేస్తా

-

బిగ్ బాస్ 2 ఫైనల్ విన్నర్ గా కౌశల్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే అతను కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ను పెంచుకున్నా ఇంట్లో ఉన్న వారు మాత్రం అతనికి విరోధులుగా మారారు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఫ్యాన్స్ మీట్ లో ఇంటి సభ్యుల గురించి మాట్లాడిన కౌశల్ వారి చేత మళ్లీ టార్గెట్ చేయబడుతున్నాడు. ముఖ్యంగా బాబు గోగినేని కౌశల్ మీద.. అతని ఆర్మీ మీద పగ బట్టాడు.

డబ్బులతో కొనే ఫాలోవర్స్ తో బిగ్ బాస్ విన్నర్ గా కౌశల్ గెలిచాడని.. కౌశల్ ఆర్మీ కచ్చితంగా పెయిడ్ ఆర్మీ అని అంటున్నాడు. అయితే దీనికి కౌశల్ కూడా ఘాటుగా స్పందిస్తున్నాడు. కౌశల్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ అని ప్రూవ్ చేస్తే బిగ్ బాస్ టైటిల్ తో పాటుగా తనకు వచ్చిన ప్రైజ్ మనీ కూడా తిరిగి ఇచ్చేస్తా అని అంటున్నాడు కౌశల్.

కౌశల్ చెప్పింది కూడా వాస్తవమే.. కౌశల్ ను గెలిచిన వారిలో ఇంట్లో కూర్చుని టివిలు చూసే గృహిణిలు ఉన్నారు. మరి వారిని కూడా పెయిడ్ ఆర్మీ అంటే ఎలా.. కౌశల్ ఆర్మీ ప్రభావం ఎక్కువ శాతం ఉన్నా కౌశల్ గెలవడంలో లేడీ ఫాలోవర్స్ కూడా ఎక్కువే అని కొందరు అంటున్నమాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version