దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఆసీస్ స్టార్ బౌలర్ కమీన్స్ ని విధ్వంసకర బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ ని మరియు శ్రీలంక బౌలర్ హసరంగాని వేలంలో దక్కించుకొని సన్ రైజర్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ ముగ్గురు ప్లేయర్స్ జట్టులోకి రావడంతో సన్రైజర్స్ హైదరాబాద్ టీం పటిష్టంగా కనబడుతుంది.
ఇదిలా ఉండగా…. సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాన్యం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సన్ రైజర్స్ సారథిగా ఉన్నటువంటి మార్క్రంని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి వేలంలో 20.5 కోట్లు పెట్టి దక్కించుకున్నటువంటి కమ్మిన్స్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం.
రీసెంట్ గా జరిగిన వన్డే ప్రపంచ కప్పుని సాధించడంతోపాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోపీని పాట్ కమ్మిన్స్ సారథ్యంలో కంగారులు సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. కెప్టెన్లని మరియు కోచ్లను మారుస్తున్నప్పటికీ గత కొన్ని సీజన్ల నుంచి సన్రైజర్స్ టీం పేలవమైన ప్రదర్శనను చేస్తుంది. మరి ఇకనైనా కమిన్స్ సారధ్యంలో అయినా ట్రోపీని గెలుచుకుంటుందో లేదో చూడాలి మరి.