74 అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జిగా లోకేష్..? చంద్రబాబు ప్రతిపాదనతో కంగు తిన్న టిడిపి నేతలు..

-

యువ గళం పాదయాత్ర ముగింపు అనంతరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కొత్త ఆలోచన వచ్చింది. అదే ఆలోచన ఇప్పుడు పార్టీ వర్గాల్లో గుబులు రేపుతుంది.. పాదయాత్రను కూడా విజయవంతంగా నిర్వహించలేని నారా లోకేష్ నెత్తిన బృహత్ కార్యక్రమాన్ని పెట్టేందుకు చంద్రబాబు అడుగులు వేస్తున్నారట.. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో.. ఒక ప్రాంతానికి లోకేష్ బాబు ఇన్చార్జిగా పెట్టాలని చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారు.. ఇదే విషయాన్ని పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు చంద్రబాబు చెప్పారని చర్చ జరుగుతుంది..

గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి ఇంచార్జిగా లోకేష్..

కడప కర్నూల్ అనంతపురం ప్రకాశం చిత్తూరు నెల్లూరు జిల్లాలను గ్రేటర్ రాయలసీమ ప్రాంతంగా విభజించి అక్కడ రాజకీయాలన్నీ లోకేష్ బాబు కొనసన్న లోనే జరిగేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట.. అక్కడ అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి, ప్రచారం, ఆర్థిక వ్యవహారాలన్నీ లోకేష్ చూసేలా రూపకల్పన చేస్తున్నారు.. 175 అసెంబ్లీ నియోజకవర్గం, ఎంపీ స్థానాలను చూసుకోవడం తనకు ఇబ్బందిగా ఉందని.. అందుకే గ్రేటర్ రాయలసీమ ప్రాంతాన్ని లోకేష్ కు అప్పగిస్తున్నట్లు పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పారు..

చంద్రబాబు నిర్ణయం పై ఆందోళనలో గ్రేటర్ రాయలసీమ నేతలు..

టిడిపి అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై గ్రేటర్ రాయలసీమ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.. లోకేష్ సామర్థ్యం ఏంటో పాదయాత్రలోనే చూసామని.. 74 నియోజకవర్గాలకు లోకేష్ ఇన్చార్జిగా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు అసాధ్యమవుతుందని గ్రేటర్ రాయలసీమ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారట.. ఏ నియోజకవర్గము ఏ జిల్లాలో ఉంది..? అక్కడ ఇన్చార్జ్ ఎవరు..? ఏది రిజర్వ్ నియోజకవర్గం అనేది కూడా లోకేష్ కు అవగాహన లేదని.. ఇలాంటి సమయంలో పార్టీ పెద్ద రిస్కే చేస్తుందని ఓ సీనియర్ నాయకుడు చంద్రబాబు వద్ద చెప్పారట.. దీంతో చంద్రబాబు ఆ ప్రతిపాదనపై ఆలోచనలో పడినట్లు పార్టీ లో చర్చ నడుస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news