సలార్ మూవీలో చూపించిన ఖాన్సార్ నగరం ఎక్కడ ఉందో తెలుసా…..

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన సలార్ మూవీ భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయింది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. అయితే ఈ సినిమా మొత్తం ఖాన్సార్ నగరం చుట్టూ తిరుగుతుంది. అసలు ఈ నగరం ఉందా లేక క్రియేట్ చేశారా…..ఒకవేళ ఉంటే ఎక్కడ ఉంది అని నెట్టింట చర్చలు జరుగుతున్నాయి.

ఈ నగరం గుజరాత్, పాకిస్తాన్ మధ్య ఉన్నట్టు ఈ సినిమాలో చూపించారు. కానీ ఖాన్సార్ నగరం మాత్రం ఇరాన్లోని ఇస్పహిన్ ప్రావిన్స్ లో ఉంది. ఇక్కడ 22 వేల మందికి పైగా పర్షియన్స్ ఉన్నట్టు సమాచారం. ఈ నగరం సినిమాలో చూపించినట్టుగా ఉండదట దానికి భిన్నంగా ఉంటుందట. త్వరలో ఈ సినిమాకి పార్ట్ 2 రాబోతుందని ప్రశాంత్ నీల్ తెలిపారు. అలాగే పార్ట్ 2 టైటిల్ కూడా రిలీజ్ చేశాడు. ఈ చిత్రంలో పృధ్ధిరాజ్ సుకుమారన్, జగపతిబాబు ,ఈశ్వరి కుమారి తదితర నటులు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news