సైబర్ నేరస్తుడికి టీడీపీ సపోర్ట్

-

సైబర్‌ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోంది తెలుగుదేశం పార్టీ. అధికార పార్టీపై బురద చల్లడమంటే తెలుగుదేశం పార్టీకి భలే సరదా. అవకాశం దొరకితే చాలు ఇష్టానుసారంగా కామెంట్లు చేయడం,సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం వంటివి సరదాతో కూడుకున్న వ్యవహారాలు. ఇష్టానుసారంగా రాతలు రాయడం,కనీస మర్యాద లేకుండా సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం వారికే చెల్లుతుంది.చదువు,సంస్కారమంటూ ఊదరగొట్టే ప్రసంగాలు దంచే పచ్చచొక్కా పార్టీకి అందులోని నేతలకు అసలు ఆ రెండూ లేవు అనేందుకు ఉదాహరణ సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న పోస్టింగ్‌ల రచ్చ. ఇటీవలకాలంలో చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనలను ఎవరూ మెచ్చడం లేదు సరికదా తిట్టిపోస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై,ఆయన కుటుంబంపై బురద జల్ల్లుతూ పోస్టులు పెడితే దానికి పచ్చబ్యాచ్‌ వత్తాసు పలుకుతోంది.సభ్యత సంస్కారంతో మెలగాల్సిన నేతలు బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు.మాట్లాడితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, పదిహేనేళ్ళు సీఎం అని డాంభికాలు మోగించుకోవడమే తప్ప చేసిన అభివృద్దిని చెప్పుకుని ప్రజల దగ్గరకు వెళ్ళే దమ్ము ధైర్యం లేని తండ్రీ కొడుకులు అధికార పక్షంపై బురద చల్లేందుకు దారులు వెతుక్కోవడం హాస్యాస్పదమనే చెప్పుకోవాలి.

నాలుగున్నరేళ్ళుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సీఎం జగన్ గురించి ఇష్టమొచ్చినట్లు వాగితే చోధ్యం చూస్తూ ఎవరూ కూర్చోరు అని నిరూపించింది వైసీపీ ప్రభుత్వం.ఇపుడు జరిగింది కూడా అదే.ఖండాంతరాలు దాటి వెళ్ళి నాగరికత, సభ్యత సంస్కారం మర్చిపోయి నోటికొచ్చినట్లు పోస్టులు పెడితే ఏమి చేయలేరనే కదా యాష్ గాడి ధైర్యం. అతని పై చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అందుకే తెలుగు నేల మీద అడుగు పెట్టిన మరుక్షణమే పోలీసులు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ వాడికి వత్తాసు పలుకుతున్న పచ్చ చొక్కాలకు ఇంకా బుద్ది రాలేదు.

చంద్రబాబు ఫ్యామిలీ పై కామెంట్ చేస్తేనే మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి జనం మర్చి పోలేదు. చంద్రబాబు కుటుంబీకుల విషయంలో ఎవరైనా అలా మెసేజిలు, పోస్టింగులు పెడితే పచ్చచొక్కాలు అభినందించి దండలు వేసి దండం పెడతారా….? చెప్పండి. అందరి కుటుంబాలు అలాంటివే. ఎవరికి ఉండాల్సిన గౌరవం హోదా వాళ్లకు ఉంటాయి. ప్రజల హృదయాల్లో సుస్థిరం ఏర్పరచుకోవడం చూసి ఓర్వలేక ఇలాంటి రోత పనులు చేయడం సరికాదన్నది ప్రజల మాట. ఇప్పటికే గుప్పెడు సీట్లు ఇచ్చి మూలన కూర్చోపెట్టినా పచ్చపార్టీకి ఇంకా సిగ్గు రాలేదా అని జనం తిట్టి పోస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news