మహాకూటమిలో తెదేపా అనుసరించాల్సిన వ్యవహారంపై తెదేపా ముఖ్యనేతలతో సమావేశమైన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చర్చించారు. ఇందులో భాగంగా సీట్ల విషయంలో సర్దుకుపోదాం అంటూ స్థానిక నేతలకు సూచించారు… మహాకూటమి విజయానికి తెదేపా నేతలు, కార్యకర్తలు కష్టపడాలని ఆదేశించారు. మహాకూటిమి పొత్తులో భాగంగా 12 సీట్లు ఇవ్వడానికి సిద్ధపడిన కాంగ్రెస్‌ను.. మరో ఆరుసీట్లు అడుగుదామని చంద్రబాబు సూచించారు. సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ పెద్దలతో తాను మాట్లాడతానని అన్నారు. సీట్ల రాలేదని ఎవరు అధైర్య పడవొద్దు.. మహాకూటమి అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ప్రత్యామ్నాయ పదవులు దక్కుతాయని చంద్రబాబు హామి ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగకపోవడాన్ని, తెరాస ప్రభుత్వం విస్మరించిన హామీలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలను ఆదేశించారు.
సీట్ల విషయంలో సర్దుకుపోదాం…చంద్రబాబు
-