స్ఫూర్తి: బామ్మా మజాకా…!

-

వృద్ధాప్యం లోకి వస్తూంటే ఈసురో వాసుదేవ అంటూ ఉండడం సహజం. కానీ యువకులకు మేము ఏ మాత్రం తీసిపోము అంటూ డెబ్భై ఏళ్ల వయసులో కూడా జీవితాన్ని ఆస్వాదించాల్సిందే అని అంటున్నారు బామ్మలు. ఏమాత్రం వీళ్ళ హుషారు కూడా తగ్గలేదు. ట్రెండ్‌కు తగినట్టుగా ఉత్పత్తి దారులు సరి కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ‘ఫ్యాషన్‌ గ్రాండ్‌ మాస్‌’, ‘గ్రానీ మోడల్స్‌’, ‘గ్రాండ్‌ డాడ్స్‌’ పేర్ల తో కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు. నిజంగా వీళ్ళు క్యాట్‌ వాక్‌ చేస్తే కెమెరాలు ఆగకుండా క్లిక్‌ మంటూనే ఉంటాయి.

చైనాలో నేడు 88 ఏళ్ల ఓ బామ్మ ఫ్యాషన్‌ ఐకాన్‌ అంటే నమ్మగలరా? ఇలా ఈ బామ్మలు భామల్లాగ మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇది ఇలా ఉండగా మరి కొంత మందికి అయితే అస్సలు ఖాళీయే లేదు. వాళ్ళ డైరీ ఫుల్‌ బిజీ. వయసు లో ఉన్నప్పుడు లేని మేకప్స్ అన్ని ఇప్పుడు వేసుకుంటున్నారు. ఉదయం ఏడు గంటలకు షూటింగ్‌కు వెళ్లి రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వస్తున్నారు… ఫుల్ షూటింగ్స్.

ఏది ఏమైనా వయసు లో ఉన్నప్పుడు చేయాలని అనుకున్నవి… చేయకుండా ఆగిపోయిన వాటి వైపు మళ్ళీ వెళ్లడం చాలా గొప్ప విషయం. సంగీతం, పియానో నేర్చుకోవడం, డాన్స్‌ క్లాసులకు వెళ్లడం లాంటి వాటి తో పాటు ఫ్యాషన్‌, మోడలింగ్‌, ఎండోర్స్‌మెంట్లు కూడా చేరాయి. అబ్బా నిజంగా మోడల్స్ ఎంతో మందికి రోల్ మోడల్స్.

Read more RELATED
Recommended to you

Latest news