వేరుశనగ ఆరోగ్యానికి చాల మంచిది. ఈ వేరుశనగలో ఫైబర్, జింక్, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉన్నాయి. వేరుశనగ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది ఇలా ఉంటె వేరు శనగని తొక్కతో తింటే ఇంకా మంచిది అంటున్నారు నిపుణులు. ఈ తొక్కల్లో బయోయాక్టివ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటయి. వీటి మూలంగా వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి. ఇలా ఒకటేమిటి ఎన్నో లాభాలు ఉన్నాయండి. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
ఈ తొక్కలో ఉండే పాలీఫెనాల్ చర్మం పొడిబారకుండా చేయడంలో ఉపయోగపడుతుంది. అలానే గుండె సంబంధిత వ్యాధులు, కాన్సర్ వంటి రోగాలు సోకకుండా ఇది మేలుచేస్తుంది. 2012 లో చేసిన పరిశోధనలో తేలింది ఏమిటంటే వేరుశనగని తొక్కతో తింటేనే ఎన్నో ఉపయోగాలు అని వెల్లడించారు. ఈ తొక్క లో ఉండే ఫైబర్ కూడా మనిషికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడం, బాడీ బరువును తగ్గించడం, శరీరం లో పేరుకు పోయిన కొవ్వును కూడా ఇది కరిగిస్తుందని నిపుణులు అంటున్నారు.
అలానే ఉడకబెట్టిన వేరుశనగలని తొక్కలతో సహా తినడం మూలంగా గెండె జబ్బులను, శరీర మంటను, దురదల్లను, వాపును తగ్గిస్తాయి. రోజు గుప్పెడు ఈ వేరుశనగల్ని గనకు మీరు తీసుకున్నట్టైతే అతి భయంకరమైన వ్యాధుల నుంచి మీరు ఉపశమనం పొందగలరు. కాబట్టి తొక్కతో ఉండే ఈ వేరు శెనగలని తీసుకుని ఆరోగ్యంగా ఉండండి.