హనుమాన్ మూవీపై ఆర్జీవీ ప్రశంసలు.. యునానిమస్ బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్

-

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో ఇంత అద్భుతమైన మూవీ తీశారంటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ram-gopal-verma

 

ఫిక్స్,ఎలివేషన్స్, ఎమోషన్స్ ఇలా ప్రతీ పాయింట్ లోనూ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరోలు సైతం హనుమాన్ సినిమాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తాజాగా హనుమాన్ మూవీ పై తన అభిప్రాయాన్ని సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.ముందుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జకు నా అభినందనలు. హనుమాన్ మూవీ యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ అని జై హనుమాన్.. అంటూ ట్వీట్ చేశారు. ఇక రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ కు స్పందించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. థ్యాంక్యూ సర్.. అంటూ రిప్లయ్ ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news