ఇటీవలే ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుండి హార్థిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టు ఫ్రాంచైజీ దక్కించుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే అనుభవజ్ఞుడైన మరియు అద్భుత నైపుణ్యాలు ఉన్న హార్థిక్ పాండ్యా లాంటి ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం కష్టంమే అయినప్పటికీ… అతని స్థానాన్ని గిల్ దాదాపు భర్తీ చేసే సామర్థ్యం గల ప్లేయర్ అని ఆశిష్ నేహ్రా పేర్కొన్నాడు. గిల్ పై ఉన్న నమ్మకంతోనే గుజరాత్ యజమాన్యం అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిందని తెలిపాడు. ఫలితాలతో సంబంధం లేకుండా మా యొక్క ప్రోత్సాహం అతనికి ఉంటుందని పేర్కొన్నాడు.
గిల్ యొక్క వయసు 24 నుంచి 24 మధ్యలోనే ఉంటుందని గత మూడు నాలుగు ఏళ్లుగా అతడు ఒక మంచి నైపుణ్యం గల ఆటగాడిగా ఎదిగిన విధానాన్ని మనం చూస్తూనే ఉన్నామని అన్నాడు. ఐపీఎల్ మినీ వేలంలో గుజరాత్ జట్టు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్ట్ కొరకు పోటీ పడడాన్ని ప్రస్తావిస్తూ అంత మంచి బౌలింగ్ నైపుణ్యం గల స్టార్క్ కొరకు కోల్కతా నైట్ రైడర్స్ యజమాన్యం అంత వెచ్చించి తీసుకోవడం అనేది నన్నేమీ ఆశ్చర్యపరచలేదని అతడు ఎంతో సమర్థవంతమైన బౌలర్ అని తెలిపాడు.