IND VS SA : ముగిసిన మొదటి ఇన్నింగ్స్….

-

ఈరోజు జరుగుతున్న మూడే వన్డేలో టీమిండియా సౌత్ ఆఫ్రికా తో తలపడుతుంది ఈ వన్డేకి kl రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది.

తొలుత బ్యాటింగ్ కి దిగిన టీమిండియాలో ఓపెనర్ సాయి సుదర్శన్ 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈరోజు వన్డేల్లో అరంగేట్రం చేసిన మరో ఓపెనర్ రజత్ పాటీధర్ 16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ తో 22 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 49 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియాను సంజు సామ్సన్ మరియు తిలక్ వర్మా ఆదుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ అర్థ సెంచరీ చేయగా సంజు సాంసన్ సెంచరీతో కదం తొక్కాడు.110 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో సంజూ శాంసన్ సెంచరీ పూర్తి చేశాడు. తిలక్ వర్మ 70 బంతుల్లో తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ కేఎల్ 21 పరుగులు మాత్రమే చేసి పెవీలియన్ చేరాడు.ఆఖరిలో రింకూ సింగ్ 27 బాల్స్ లో 38 పరుగులు చేయగా , వాషింగ్టన్ సుందర్ 14 పరుగులు చేశాడు. దీంతో 50 ఓవర్లలో 8 వికెట్ల  నష్టానికి 296 పరుగులను చేసింది.సౌతాఫ్రికా బౌలర్లో హెండ్రింక్స్ 3 వికెట్లు తీయగా,బర్గర్ 2, కేశవ్ మహారాజ్ ,మల్డర్, విలియమ్స్ చెరో వికెట్ పడగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news