చంద్రబాబుకు… సీఎం జగన్ కు ఉన్న తేడా ఇదే !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పుట్టినరోజు. సీఎం జగన్ పుట్టినరోజు నేపథ్యంలో… వైసిపి కార్యకర్తలు అలాగే నేతలు సంబరాలు జరుపుకున్నారు. సజ్జల రామకృష్ణ రెడ్డి లాంటి కీలక నేతలు అయితే 600 కిలోల కేక్ కూడా కట్ చేశారు. అటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్ర నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సీఎం జగన్కు సోషల్ మీడియా వేదిక గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు జాతీయ నేతలు, గల్లీ లీడర్లు అందరూ సీఎం జగన్కు శుభాకాంక్షలు తెలుపుతూ… గారు అని సంబోధించారు. అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా రెస్పెక్ట్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారన్నమాట.

ఇక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి రిప్లై కూడా ఇచ్చాడు. చంద్రబాబు సింపుల్ గా జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేస్తే… దానికి బదులుగా థాంక్యూ బాబు గారు అని జగన్ రెస్పెక్ట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా… జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంతో ఉన్నత స్థానంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటూ సంబోధించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు నాయుడుకే కాకుండా మిగతా రాజకీయ నేతలు అలాగే టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి రిప్లై ఇచ్చాడు.

మరీ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి విజనరీ, అని చెప్పుకునే చంద్రబాబు ఏకవచనంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఎవరైనా శుభాకాంక్షలు చెప్తారా..? అని కొంతమంది అంటున్నారు. ఇదే చంద్రబాబుకు జగన్ గారికి ఉన్న తేడా అంటూ నెటిజన్లు చర్చిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news