విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.86.48
వారానికి రెండు మూడు సార్లు పెరుగుతున్నపెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు విసిగిపోతున్నారు. అయితే ఆదివారం మరో సారి పెట్రోలు పై 12 పైసలు, డీజిల్ పై 10 పైసలు పెరగడంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ పెరుగుదలతో హైదరబాద్లో లీటర్ పెట్రోలు రూ.85.35, డీజిల్ రూ.78.98కి చేరుకోగా విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.86.48,డీజిల్ రూ.79.78గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రో రూ.80.50, డీజిల్ రూ.72.10కి చేరింది. ధరలు ఎగబాకడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్రం ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా ఉండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేపు భారత్ బంద్
పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో ఈ బంద్ కి ఇప్పటికే ఎన్సీపీ, డీఎంకే, ఎండీఎంకే, ఎస్పీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని జనసేనతో సహ ఇతర పార్టీలు మద్దతు తెలిపాయి.