రేపు అనగా సెప్టెంబర్ 10 సోమవారం రోజున దేశవ్యాప్తంగా బంద్ జరగనున్న విషయం తెలిసిందే. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త సమ్మేకు పిలుపునిచ్చింది. అయితే.. బంద్ ప్రభావం బ్యాంకులపై ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
వరుసగా రెండు రోజులు సెలవు రావడం, మళ్లీ సోమవారం బంద్ సందర్భంగా బ్యాంకులు మూసేస్తే కీలక లావాదేవీలకు ఆటంకం కలుగుతుందని..అందుకే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులన్నీ పనిచేస్తాయని బ్యాంకు అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటం, రూపాయి విలువ పతనం అవ్వడమే భారత్ తో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణమని.. దీనిపై తామేమీ చేయలేమని కేంద్రం చేతులెత్తేసింది. ఇవాళ హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 85.35 ఉండగా.. డీజిల్ ధర 78.98 గా ఉంది.