1.78 లక్షల టీచర్ పోస్టులు.. దేశంలో ఎవరైనా అర్హులే..!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేస్తున్నట్టు చెప్పారు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. త్వరలో బీహార్ లోని ఉపాధ్యాయ పోస్టులని భర్తీ చేయనున్నారు. స్థానికులే కాకుండా ఏ రాష్ట్రం వాసులైనా ఈ పోస్టులకి దరఖాస్తు చెయ్యవచ్చు. మంగళవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇది వరకైతే కేవలం స్థానికులనే తీసుకునేవారు. కానీ ఇప్పుడు అందరు అర్హులే అని నిర్ణయం తీసుకున్నారు. భారతీయ పౌరులు ఎవరైనా బిహార్‌లోని 1.78 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు అప్లై చేయవచ్చు. బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా పోస్ట్స్ ని భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది.

మొత్తం 1.78 లక్షల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మే 2న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదాన్ని ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ పోస్టుల్లో 85,477 ప్రైమరీ టీచర్లు, 1,745 మాధ్యామిక టీచర్లు, 90,804 హైస్కూల్ టీచర్ పోస్టులు వున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news