ఈ స్కీమ్ తో 10 లాభాలు.. 16 లక్షలు..!

-

మీరు దేనిలోనైనా ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? ఎటువంటి రిస్క్ లేకుండా డబ్బులు పెట్టాలని అనుకుంటున్నారా..? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బులు పెడితే బాగుంటుంది. దీనిలో డబ్బులు పెడితే చక్కటి లాభాలను పొందొచ్చు. ఇందులో డబ్బులు పెడితే పది రకాల ప్రయోజనాలు పొందొచ్చు. 16లక్షలు కూడా వస్తాయి.

సెక్షన్ 80సీ కింద ఇన్వెస్ట్ చేసిన డబ్బులపై ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి.
ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు వస్తోంది.
ఇది ఈఈఈ కేటగిరి కిందకు వస్తుంది కనుక మూడు రకాల పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.
విత్‌డ్రా చేసుకునే మొత్తంపై కూడా ఎలాంటి పన్ను పడదు.
పైగా ఎలాంటి రిస్క్ ఉండదు.
తక్కువ మొత్తంతో కూడా ఈ అకౌంట్ తెరవొచ్చు.
ఆటోడెబిట్ యాక్టివేట్ చేసుకోవచ్చు.
రూ.500 తో ఖాతా తెరవొచ్చు.
మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. టెన్యూర్ అయిపోయిన తర్వాత కూడా ఐదేళ్ల చొప్పున పెంచుకోవచ్చు.
దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఈ ఆప్షన్ ఉపయోగ పడుతుంది.

ఎంత డబ్బులు వస్తాయి..?

మీరు దీనిలో నెలకు రూ. 5 వేలు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 16 లక్షలకు పైగా పొందొచ్చు. ఈ అకౌంట్ ని మీరు ఓపెన్ చెయ్యాలని అనుకుంటే దగ్గర లో వుండే పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news