విషాదం : కూలిన 10 అంతస్థుల భవనం.. 5గురు మృతి..

-

10 అంతస్థుల భవనం కూలి 5 మృతి చెందిన ఘటన ఇరాన్‌లో చోటు చేసుకుంది. ఇరాన్‌లోని అబాడాన్‌ నగరంలో పదంస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన 80 మంది వరకు చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ఇరాన్‌ స్టేట్‌ టీవి తెలిపింది.

రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టేందుకు ఇతర ప్రాంతాల నుంచి అత్యవసర బృందాలను పంపుతున్నట్లు స్టేట్ టీవి పేర్కొంది. రెండు రెస్క్యూ డాగ్‌లు, హెలికాప్టర్, ఏడు రెస్క్యూ వాహనాలను ఇప్పటికే సంఘటనా స్థలంలో మోహరించినట్లు తెలిపింది. అయితే, భవనం కూలడానికి మాత్రం కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించగా.. భవన నిర్మాణ కాంట్రాక్టర్‌ను అరెస్టు చేసినట్లు వివరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version