పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ లకు జన్మించిన మొదటి సంతానం అకీరానందన్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే . అకీరానందన్ జన్మించిన తర్వాత రేణు దేశాయ్ , పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకున్న వీరిద్దరూ మళ్లీ ఎప్పుడూ కలవలేదు అని చెప్పాలి. కానీ ఇటీవల తన కొడుకు కోసం మళ్లీ ఒకే ఫ్రేమ్లో కనిపించి అభిమానులకు ఆనందాన్ని కలుగజేశారు. నిజానికి అకీరానందన్ పియానో ఎలా వాయిస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక తాజాగా ఇతను ఆర్.ఆర్.ఆర్ లో వచ్చిన దోస్తీ పాటను వాయించి అందరికీ ఆశ్చర్యాన్ని కలుగ చేశారు. తాజాగా తన స్కూల్ గ్రాడ్యుయేషన్ డే లో అఖిరా పర్ఫామెన్స్ ఇచ్చి అందరిని ఫిదా చేశాడు.