తెలుగురాష్ట్రాలను కరోనా మహమ్మారి కలవర పెడుతుంది. ముఖ్యమంత్రులు ఎన్ని కట్టుబాటు చేర్యాలు చేపడుతున్నా ఈ వ్యాధికి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 16934 కేసులు నమోదయ్యాయి. కాగా 206 మంది కరోనాతో పోరాడుతూ మరణించారు. ఇక కేవలం చిత్తూరు జిల్లా లోనే దాదాపుగా 1200 కేసులు నమోదయ్యాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి ఓ కుటుంబం పై కాటు వేసింది. ఒకే ఇంటికి చెందిన 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా సమాచారం.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మదనపల్లెలో ఒకే కుటుంబంలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ 10 మంది బాధితుల్లో ఇద్దరు 10 ఏళ్లలోపు చిన్నారులు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. చెన్నై నుండి వచ్చిన వ్యక్తి ద్వారా వీరందరికీ వ్యాధి సోకినట్టుగా గుర్తించారు. ఇక వీరు కూడా అనేక మందితో కాంటాక్ట్ లో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వారు ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నారు ఎవరెవరిని కలిశారు అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. వారందరినీ కూడా హోం క్వారంటైన్ లో ఉండేందుకు అధికారులు సూచిస్తున్నారు.