వరదలో చిక్కుకున్న 100 మంది కార్మికులు.. రాత్రంతా పీకల్లోతు నీళ్లలో !

-

హైదరాబాద్ లో పరిస్థితి అంతకంతకూ విషమిస్తుంది. కొన్నిచోట్ల పెద్దగా నీరు నిలవ ఉన్నా ఇబ్బందులు లేకుండా భవనాల మీదకు వెళ్లారు.అయితే కొన్ని చోట్ల పరిస్థితి దారుణంగా ఉంది. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఆయిల్ ఫ్యాక్టరీలో కార్మికులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సుమారు 100 మంది ఆ ఫ్యాక్టరీలు ఉన్నట్టు సమాచారం. వారందరినీ రెస్క్యూ టీమ్ ఇప్పుడు కాపాడే పనిలో ఉంది.

A nd D0

రాత్రంతా కార్మికులు నీళ్లలోనే గడిపినట్టు తెలుస్తోంది. మనిషి లోతు నీళ్లలో రాత్రంతా జాగారం చేశారని బయట పడిన వారు చెబతున్నారు. ఆయిల్ ఫ్యాక్టరీ లోపలే క్వార్టర్స్ ఉండటంతో కార్మిక కుటుంబాలు అన్నీ లోపల ఉండిపోయినట్టు సమాచారం. ఈ 100 మందిలో మహిళలు,చిన్నపిల్లలు కూడా ఉన్నారని చెబుతున్నారు. అయితే రెస్క్యూ టీమ్స్ అన్నీ వారందరినీ తరలించే పనిలో తలమునకలై ఉన్నారు. ఇక ఢిల్లీ నుండి ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ జవాన్లు కూడా హైదరాబాద్ కి చేరుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news