సఖ్యతగా ఉండాల్సిన చోట జగన్ ఉండటం లేదా…?

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని విషయాల్లో తొందర పడుతుందా…? అనవసరంగా ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా…? న్యాయ వ్యవస్థ విషయంలో అనవసరంగా తొందరపడటం పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేస్తుందా…? అసలు న్యాయ నిపుణులు ఏమంటున్నారు…? సాధారణంగా న్యాయ మూర్తుల గురించి కొందరు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వారికి కోపం ఎక్కువగా ఉంటుందని, వారికి పరిమితులు ఎక్కువగా ఉండటంతో జీవితం మీద కొందరికి కోపం ఉంటుంది అని అంటూ ఉంటారు.

దీనితో కొంత మంది న్యాయమూర్తులు కోపంగా నిర్ణయాలు తీసుకుంటారు అని అంటూ ఉంటారు. అవి నిజమా కాదా అనేది మనకు తెలియదు. కాని చాలా మంది మాత్రం అవి నిజమే అంటారు. కాబట్టి న్యాయ స్థానాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ చేతిలో చట్టాలు ఉన్నప్పుడు దూకుడుగా వెళ్లి వారిని విమర్శించే విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించాలి. ఇప్పుడు అవినీతి కేసుల్లో విచారణ అనేది జరుగుతుంది. కాబట్టి న్యాయ వ్యవస్థతో జగన్ సఖ్యతగా ఉండాలి. కాని ఆయన మాత్రం దూకుడుగా ప్రదర్శిస్తున్నారు.

న్యాయ వ్యవస్థ అనేది చాలా సున్నితమైన వ్యవస్థ. ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద ఆయన దాడి చేస్తున్నారు అనే భావన చాలా మందిలో ఉంది. ఏకంగా కాబోయే సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి మీదనే ఆయన ఆరోపణలు చేసారు. ఏకంగా ప్రధాన న్యాయమూర్తికి ఆయన రాసిన లేఖ వివాదాస్పదం అయింది. దానికి తోడు వైసీపీ నేతలు కొన్ని విమర్శలు ఎక్కువగా చేస్తున్నారు. ఇవి అన్నీ కూడా జగన్ ని ఇబ్బంది పెట్టేస్తాయి అనేది చాలా మంది భావన. ఎన్వీ రమణ ధర్మాసనం అవినీతి కేసులను పర్యవేక్షిస్తుంది.

హైకోర్ట్ లకు ఆదేశాలు ఇచ్చిన ధర్మాసనం కూడా అదే. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాని ఇలా టార్గెట్ చేసి విమర్శల దాడి అనేది భవిష్యత్తు పరిణామాలను మార్చేస్తుంది. జగన్ కేసుల్లో సరైన ఆధారాలు లేకపోతే ఇప్పటికే కేసులు అన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చాయి. కాని కొన్ని కేసుల్లో ఆధారాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, ఆయన రాజకీయంగా బలంగా ఉన్నా గాని న్యాయ వ్యవస్థ పరంగా ఇబ్బందులను అడ్డుకోవడం సాధ్యం కాదు. కాబట్టి సైలెంట్ గా ఉండటం మంచిది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news