కరోనాని జయించాడు.. 101వ బర్త్ డే చేసుకున్నాడు..!

-

ఓ శతాధిక వృద్ధుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాని జయించాడు. ఈ సందర్బంగా అతని 101వ పుట్టిన రోజు వేడుకని డాక్టర్లు చేశారు. ఇది జరిగింది ముంబైలోని హిందూ హృదయ సమ్రాట్ బాలాసాహెబ్ థాక్రే హాస్పటల్‌లో. 100 ఏళ్లు పైబడిన అర్జున్ గోవింద్ నారింగ్రేకర్ అనే వృద్ధుడు కరోనా బారిన పడ్డాడు. దీంతో అతన్ని కాపాడేందుకు రోజులు తరబడి డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించారు.

వారి ప్రయత్నం.. గోవింద్‌లోని బతకాలనే కోరిక.. రెండూ కలిసి కరోనాను జయించాయి. దీంతో బుధవారం అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. అయితే అదే రోజు గోవిండ్ 101వ పుట్టినరోజు కావడంతో మంగళవారం చిన్న బర్త్ డే పార్టీ నిర్వహించారు డాక్టర్లు.. కేక్ కట్ చేయించి ఆయనకి శుభాకాంక్షలు తెలిపి ఆయన్ని ఆనంద పరిచారు. ఇందుకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version