ఫీజు కోసం కాలేజీ యాజమాన్యం టార్చర్ చేయడంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మేడ్చల్ లో గల శ్రీచైతన్య స్కూల్లో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.
ఫీజు చెల్లించలేదని స్కూల్ ప్రిన్సిపల్ అందరి ముందే వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ చేసిందని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.ప్రస్తుతం విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు బాధితురాలి తల్లి తెలిపింది. తన కూతురిని చదువుల కోసం పంపితే ఈ పరిస్థితి తెచ్చారని కన్నీరుమున్నీరైంది. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.