విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని విద్యా ధరపురం ఆర్టీసీ డిపో పక్కనే గల కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
నెమ్మదిగా మంటలు ఎగ్జిబిషన్‌లోని షాపులకు విస్తరించాయి.దీంతో అందులోని సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది.దట్టమైన పొగ కమ్ముకోవడంతో పాటు భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలనుఅదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కూడా అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సమాచారం. కాగా, భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.