ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు

-

ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. ఎన్నికల్లో ఉచితాలు ప్రకటించడాన్ని ధర్మాసనం తప్పు బట్టింది. ఉచితంగా నగదు, రేషన్ అందుతున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉచితాలతో ఏ పని చేయకుండా ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. ఉచితాల ద్వారా లబ్దిదారులను పరాన్నజీవులుగా మార్చేస్తున్నారని జస్టీస్ బీ.ఆర్. గవాయ్ పేర్కొన్నారు.

ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు బియ్యం వస్తున్నాయి.. కొన్నింటి ద్వారా డబ్బులు వస్తున్నాయనే భరోసాతో కొంత మంది ప్రజలు ఉంటున్నారని పేర్కొన్నారు. దీంతో ఎన్నికల్లో ఉచిత హామీలు ఇవ్వడం.. దానిని అమలు చేయడం చాలా కస్టమవుతుంది ప్రభుత్వానికి.. అందుకే సుప్రీంకోర్టు ఉచితాలపై సీరియస్ కామెంట్స్ చేసింది. సుప్రీం చేసిన ఈ కామెంట్స్ పై ప్రభుత్వాలు ఉచిత హామీలు ఇవ్వకుండా ఉంటాయా..? లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version