ఉత్తరాఖండ్ విషాదం : 11 మంది పర్వాతరోహకులు మృతి

ఉత్తరాఖండ్‌ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ట్రెక్కింగ్‌ కోసం వెళ్లిన 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్త రాఖండ్‌ లో మరో 11 మంది మృదేహాలను రెస్క్యూ బృందాలు గుర్తించాయి. అక్టోబర్‌ 18 వ తేదీన 17 మంది ట్రెక్కర్లు తప్పి పోయారు. హిమాచల్‌ ప్రదేశ్‌ లోని కిన్నౌర్‌ జిల్లా ను ఉత్తరాఖండ్‌ లోని హర్సిల్‌ తో కలిపే అత్యంత ప్రమాద కరమైన పాస్‌ లలో ఒకటి – లమ్‌ ఖగా పాస్‌ కు వెళ్లే ప్రాంతం అది.

అయితే.. కొంత మంది ట్రెక్కింగ్‌ వెళ్లి మిస్‌ అయ్యారని.. తెలిసిన అనంతరం.. అక్టోబర్‌ 20 వ తేదీన అధికారులు చేసిన ఎస్‌ ఓఎస్‌ కాల్‌ కు భారత వైమానిక దళం స్పందించింది.

రాష్ట్రం లోని పర్యాటక హిల్‌ స్టేషన్‌ అయిన హర్సిల్‌ చేరు కోవడానికి రెండు అడ్వాన్స్‌ డ్‌ లైట్‌ హెలి కాఫ్టర్ల ను ఏర్పాటు చేసింది. అదే రోజు.. నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ఏఎల్‌ హెచ్‌ క్రాఫ్ట్‌ లో రెస్క్యూ ప్రారంభించింది. చివరకు వారు రెండు రెస్క్యూ సైట్‌ లను గుర్తించగలిగారు. ట్రెక్కింగ్‌ కు వెళ్లిన 17 మంది లో 11 మంది మృతులై తేలారు. మిగతా వారికోసం వెతుకుతున్నారు.