కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత కార్తీక్ ను సందిగ్ధంలో పడేస్తుంది. నీకే నీ పెళ్లాంమీద అనుమానం వచ్చిందంటే సమాజానికి రాదా, లోకులు కాకులు కార్తీక్, దీపక్కను పతీత అంటారేమో అంటుంది. కార్తీక్ మోనిత షట్ అప్ అంటాడు. ఇక్కడ నా నోరు మూయించగలవేమో కానీ, ప్రపంచం నోరు మూయలేవు..ఇదంతా చెప్పి ఏంటి కార్తీక్ అమెరికా వెళ్తావా, ఖండాలు దాటినా నానుంచి తప్పించుకోలేవ్, నువ్వు వెళ్లినా నీ కుటుంబం అంతా ఇక్కడే ఉందిగా కార్తీక్, వాళ్లని సమాజం, మీడియా వదలదుకదా, ఇంటిముందుకు వచ్చి టెంట్ పర్మినెంట్ గా వేసుకుని రచ్చరచ్చ చేస్తాను అంటూ బెదిరిస్తుంది. అసలు ఈ మోనిత అనే మాటలకు కార్తీక్ దద్దిలా నిలబడతాడు. అక్కడనుంచి వచ్చేయొచ్చుగా..సాగదీయటం కాకపోతే. మోనిత తెగేదాక తాడులాగుతావా, పసుపుతాడు కడతావా అంటూ అరుస్తుంది. ఏంటి అమెరికా వెళ్తావా అంటుంది. కార్తీక్ దెబ్బకి మోనిత మాటలకు చెమటలుపడతాయ్..భారతిని కొంచెం మంచినీళ్లు ఇవ్వా అని అడుగుతాడు. బాటిల్ మోనితకు ఇచ్చి..తాగుమోనిత అప్పటినుంచి అరిచిఅరిచి అలిసిపోయి ఉంటాం, నువ్వు చాలాచాలా చెప్పావ్, నేను ఒకటే చెప్తున్నాను..మేం అమెరిగా వెళ్తున్నామ్..నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పి వెళ్లిపోతాడు. పర్లేదు కాస్తైనా లేపారు..
ఇంట్లో దీప లగేజ్ అంతా సర్దుకుని రెడీగా ఉంటుంది. కార్తీక్ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుందని అని దీప అంటుంది. ఇద్దరు ఇలా మాట్లాడుకుంటారు. డాక్టర్ బాబు మాటల్లో తెలియని పంతం ఉంది అంటుంది దీప. పేపర్ చూసిఉంటాడా అనుకుంటారు అందరూ. ఇంతలో ఆనంద్ రావు సౌందర్య నాకేంటో కొంచెం గుండెదడగా ఉంది అంటాడు. మీరు టెన్షన్ పడకండి అని సౌందర్య అంటుంది. ఇంతలో పిల్లలు వస్తారు. వీళ్లేదో నిజంగా అమెరిగా వెళ్లినట్లు వీరలెవలో చేస్తారు. ఆ మోనిత కచ్చితంగా ఏదో రచ్చచేస్తుంది. శ్రావ్య టాబ్లెట్ తెచ్చి ఇస్తుంది. ఆనంద్ రావు వేసుకుంటాడు. అంతా సర్దుకున్నట్లేకదా, అందరికి వీసాలు రావటమే పెద్దవిజయం అని హిమ, శౌర్యలతో తాతయ్య చెప్పినట్లు వింటారుగా అంటుంది. ఇంతలో మాలతి వస్తుంది. అది ఏడ్చుకుంటూ వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగితే..నా మొగుడికి నా మీద మాయదారి అనుమానం పుట్టింది అని ఏడుస్తుంది. ఇదంతా వెనక ఉన్న కార్తీక్ వింటాడు. ఇది మోనిత ప్లాన్ లో భాగమే అయిఉంటుంది. శౌర్య ఏంటి నాన్నమ్మ ఈ అనుమానం అంటే అంటుంది. మీరు లోపలికి వెళ్లండి అంటుంది సౌందర్య. మాలతి నా పిల్లలను దగ్గరకు తియ్యడు, నాతో మాట్లాడడు అంటూ కార్తీక్ గతంలో చేసింది చెప్తుంది.
హిమ, శౌర్యలు డాడీలంతా ఇలానే ఉంటారు. కొందరే బాగుంటారు అంటూ ఏదోఏదో మాట్లాడుకుంటారు. అమ్మలందరు మంచోళ్లే నాన్నలే చెడ్డోళ్లు ఉంటారట అంటుంది శౌర్య. దీప పిల్లలను కసురుకుంటుంది. ఇప్పుడు ఈ మాలతి సోది ఏంటో..ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందా అనొచ్చుగా..ఆ సౌందర్య కూడా ఏంటి మాలతి ఏదో ఒకటి సర్దిచెప్పుకోవాలుగా అంటుంది. వదిలేసి వెళ్లిపోయాడు అమ్మా..అందరూ నీ అంత అదృష్టవంతులు ఉండరుకదా అంటుంది. నా తలరాత ఇట్లఏడిస్తే ఎవరు ఏం చేస్తారు అమ్మా అంటుంది. శౌర్య అమ్మా నిన్ను ఏదో అదృష్టం అంటుంది ఏంటి అంటుంది. మాలతి చెప్పాల్సింది అంతా చెప్పి వెళ్లిపోతుంది. చిన్నసైజ్ బాంబ్ పేల్చిపోయింది ఆ మాలతి. కార్తీక్ అక్కడ మనసు మార్చుకోలేదు..కానీ ఇక్కడ ఈ మాలతి మాటలకు మనోడు నిర్ణయం మార్చుకున్నట్లు ఉంటాడు.
శౌర్యవచ్చి నాన్న హిమకు మీ మీద కోపం పోయింది అంటుంది. ఇదంతా ప్రియమణి వింటుంది. అందరు మాట్లాడతారు. కార్తీక్ మాత్రం ఏం మాట్లాడడు. ఏంట్రా నువ్వు నీరసంగా కనిపిస్తున్నావ్, ఫ్లైట్ కి టైం అవుతుందికదా అంటే..నేను అమెరికా వెళ్లటంలేదు డాడీ అంటాడు. అందరు షాక్ అవుతారు. హిమ వచ్చి ఏమైంది డాడీ నాకు నీ మీద కోపం తగ్గిందని శౌర్య చెప్పిందికదా అంటే.. దీప పిల్లలను తీసుకుని లోపలికి వెళ్లిపోతుంది. ఈ మాత్రం దానికి ఓ సాగదీశారు..
ఇటపక్క మోనిత తన ఇంటికి వస్తుంది. ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో మోనిత నొప్పులు పడుతుంది. తన కండీషన్ సీరియస్ గా ఉందని భారతి కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. నా కెందుకు చెప్తున్నావ్ అని కార్తీక్ సీరియస్ గా ఫోన్ కట్ చేస్తాడు. సౌందర్య మాత్రం పసిబిడ్డకు ఎందుకు శిక్షపడాలి వెళ్లి ఆపరేషన్ చేసిరా అన్నట్లు మాట్లాడుతుంది. మానవత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లా చేస్తారు వీళ్లు. కార్తీక్ మాత్రం వెళ్లను అంటాడు. సోమవారం చూడాలి మనోడు వెళ్లి ఆపరేషన్ చేస్తాడో లేదో.