డిసెంబర్‌లో 12 రోజులు బ్యాంకులకి సెలవు..!

-

కొన్ని కొన్ని సార్లు ముఖ్యమైన బ్యాంక్ పనులు ఉంటాయి. అటువంటి సమయంలో బ్యాంకులు కనుక సెలవు అయితే కచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే ముందుగా సెలవుల గురించి తెలుసుకుని పనులను క్లియర్ చేసుకోవాలి.

 

లేదు అంటే బ్యాంకుల సెలవుల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. డిసెంబర్ నెల లో 12 రోజులు బ్యాంకులు బ్యాంకులకు సెలవు. రెండవ శనివారం, నాల్గవ శనివారం, ఆదివారాలు నాడు బ్యాంకులు క్లోజ్ ఏ. అవే కాకుండా మరి కొన్ని రోజులు కూడా బ్యాంకులకు సెలవు. ఇక వాటి వివరాల లోకి వెళితే..

డిసెంబర్ 3 – సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫెస్టివల్ (పనాజీలో ఈరోజు బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 5 – ఆదివారం

డిసెంబర్ 11 – రెండో శనివారం

డిసెంబర్ 12 – ఆదివారం

డిసెంబర్ 18 – యు సో సో థామ్ వర్ధంతి (షిల్లాంగ్‌లో ఈరోజు బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 19 – ఆదివారం

డిసెంబర్ 26 – ఆదివారం

డిసెంబర్ 24 – క్రిస్మస్ (ఐజ్వాల్‌ లో బ్యాంకులు సెలవు)

డిసెంబర్ 25 – నాల్గవ శనివారం, క్రిస్మస్ (బెంగళూరు, భువనేశ్వర్ మినహా అన్ని ప్రదేశాలలో బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 27 – క్రిస్మస్ వేడుకలు (ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 30 – యు కియాంగ్ నోంగ్‌బా (షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు)

డిసెంబర్ 31 – నూతన ఏడాది సాయంత్రం (ఐజ్వాల్‌లో బ్యాంకులు పని చేయవు)

 

Read more RELATED
Recommended to you

Exit mobile version