పునీత్ న‌న్ను కుటుంబ సభ్యుడిలా చూసుకున్నాడు…రాజ‌మౌళి ఎమోష‌న‌ల్..!

-

క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణం యావ‌త్ సినీలోకాన్ని కంట‌త‌డి పెట్టించింది. పునీత్ రాజ్ కుమార్ క‌న్న‌డ హీరో అయిన‌ప్ప‌టికీ ఆయ‌న తండ్రి రాజ్ కుమార్ సీనియ‌ర్ హీరోఅవ్వ‌డం పునీత్ కు సైతం దేశ‌వ్యాప్తంగా ఉన్న సినీప్ర‌ముఖుల‌తో మంచిసంబంధాలు ఉండ‌టంతో ఇప్ప‌టికీ ఆయ‌న‌ను గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగువారికి పునీత్ తో ఎంతో ద‌గ్గ‌రి సంబంధాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య పునీత్ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన స‌మ‌య‌లో కంట‌త‌డి పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ద‌ర్శ‌క‌దీరుడు రాజమౌళి తాజాగా పునీత్ మ‌ర‌ణంపై స్పందించారు. త‌న‌కు ఏం మాట్లాడాలో అర్థం కావ‌డంలేద‌ని అన్నారు. ఎవ‌రైనా చిన్న సాయం చేసినా ప్ర‌పంచానికి తెలియాల‌నుకుంటార‌ని..కానీ పునీత్ మాత్రం అలా కాద‌ని అన్నారు. నాలుగేళ్ల క్రితం తాను బెంగుళూరు వెళ్లిన‌ప్పుడు పునీత్ ను క‌లిశాన‌ని అప్పుడు త‌న‌ను కుటుంబ స‌భ్యుడిలా చూసుకున్నార‌ని చెప్పారు. త‌న‌తో చాలా స‌ర‌దాగా మాట్లాడార‌ని..ఓ స్టార్ తో మాట్లాడుతున్న భావ‌నే క‌ల‌గ‌లేదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version