ఏపీ రైతులకు గుడ్ న్యూస్ : వారందరికీ ఎకరానికి 12 వేల ఆర్థిక సహాయం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరదల కారణంగా నష్టపోయిన వారికి వరాల వర్షం కురిపిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే… వ్యవసాయ భూముల్లో ఇసుకమేట తొలగించడానికి… ఎకరానికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని రైతులకు ప్రకటించారు సీఎం జగన్. అలాగే వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి.. కుటుంబంలో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు సీఎం జగన్. ఈ విషయాన్ని తాజాగా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

“ఇటీవల వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామనడం, ఇసుక మేటలు తొలగించడానికి ఎకరానికి 12 వేలు సాయం చేస్తామని జగన్ గారు ఇచ్చిన హామీ బాధితులకు కొండంత ఊరటనిచ్చింది. రేషన్ సరుకులతో పాటు తాత్కాలిక సాయం ఇప్పటికే అందరికీ అందించారు.” అంటూ సిఎం జగన్ ట్వీట్ చేశారు. మానవత్వం మూర్తీభవించిన మఖ్యమంత్రి మన జగన్ … వరద బాధితుల పరామర్శలో తన కుమార్తెకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని మదనపల్లెకు చెందిన మహిళ అభ్యర్థిస్తే అవుట్ సోర్సింగ్ జాబ్ ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు. గతం ప్రభుత్వం హయాంలో ముందుగా బ్రీఫ్ చేసిన వారినే సిఎం దగ్గరకు పంపేవారని ఎద్దేవా చేశారు.