తెలంగాణలో చేత కానోడు.. ఢిల్లీలో చక్రం తిప్పుతాడా? : కెసిఆర్ పై ఈటల సెటైర్

-

రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఈటల రాజేందర్.. కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ లో చేతకాని వాడు, ఢిల్లీలో చక్రం తిప్పుతా అని పోతున్నాడని సెటైర్లు పేల్చారు. రైతు చట్టాలు వెనక్కు తీసుకోవడం గొప్ప విషయమనీ… ప్రధానమంత్రి జెంటిల్మెన్ గా వ్యవహరించాడన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎగరబోయే జెండా కాషాయ జెండానేనని పేర్కొన్నారు ఈటల. గొప్ప రాజ్యాంగం ఉన్న ఈ దేశంలో.. హుజూరాబాద్ లో కేసిఆర్ నియంతృత్వంతో స్వేచ్ఛను హరించారని మండిపడ్డారు. స్వేచ్ఛ మీద ఉక్కుపాదం పెట్టారు… అందుకే అక్కడ ప్రజలు బయటికి మాట్లాడకుండా ఉండి అవకాశం వచ్చినపుడు ఓటు శక్తి చూపించారన్నారు.

కెసిఆర్ కోరలు పీకారు… చెంప చెళ్లుమనిపించి.. చరిత్ర నిర్మాతలు ప్రజలే అని నిరూపించారని పేర్కొన్నారు. హుజూరాబాద్ దేశానికి, రాష్ట్రానికి దిక్షూచి అని… స్ఫూర్తిని నింపిందని కొనియాడారు ఈటల. ఒక నాడు నాయకుడు అంటే త్యాగమని…ఈ రోజు నాయకుడు అంటే వ్యాపారం అనే భావనకు ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని అగ్రహించారు.

25 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని… ప్రజల ప్రేమను చూసినవాడినని పేర్కొన్నారు. ఉద్యమంలో ఎలా ప్రజలు కొట్లాడమని ముందుకు పంపించారో.. ఇప్పుడు కూడా అలానే కొట్లాడమని పంపిస్తున్నారన్నారు. కెసిఆర్ ఏం చేసినా.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మార్పు తధ్యమన్నారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే వారు తెరాసాకి పోతున్నారని.. యాంటి డిఫెక్షన్ లా ను అపహస్యం చేసిన వాడు కెసిఆర్ అని అగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news