స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షిని ఒక పంజరంలో పెడితే ఎంత భాద పడుతుందో అంత స్వేచ్ఛగా, విచ్చలవిడిగా ఇష్టమొచ్చినట్టు బతుకున్న మనిషిని కంటికి కనిపించని చిన్న జీవి, క్షమించాలి దాన్ని జీవి అని కూడా చెప్పలేని, పరాన్న జీవి(అయ్యిందోచ్చు) కరోనా వైరస్ ఇంటికే పరిమితం చేసేసింది. సెలవుల కోసం ఎదురుచూసే స్టూడెంట్స్, ఉద్యోగస్తులు కూడా ప్రపంచంలోనే మొదటిసారి సెలవులు ఎందుకు వచ్చాయని బాధపడుతున్నారు. ఇలాంటి బయట తిరగలేని, ఫ్రెండ్స్ ని కలవలేని, గర్ల్ ఫ్రెండ్ తో రెస్టారెంట్ కి వెళ్లలేని, ఫ్యామిలీతో బయటకు వెళ్లలేని సెలవులు ఎందుకని కరోనాను బండ భూతులు తిడుతున్నారు. కరోనా వల్ల ఎప్పుడు విననటువంటి లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్, క్వారంటీన్, సెల్ఫ్ ఐసోలాషన్ లాంటి కొత్త పదాలు వింటున్నారు. కరోనా వల్ల లాక్ డౌన్ ఏర్పడటంతో చాలా మంది ప్రజలు లాక్ డౌన్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తున్నారు. అయితే కొంత మందిమాత్రం లాక్ డౌన్ నియమాలను పాటించకుండా, అధికారుల కన్ను కప్పి బయట తిరగడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంట్లోనే ఉంటూ నిస్సహాయతకు గురి అవుతున్న వారు ఒక్కసారి లాక్ డౌన్ ఎత్తేస్తే విచ్చలవిడిగా తిరగడానికి రెడి గా ఉన్నారు.
అయితే దీనిపై మానసిక వైద్యులు స్పందింస్తూ… ఏదైతే చేయకూడదని చెప్తమో అది చేయడానికి మనిషి ఆసక్తి చూపుతాడాని, లాక్ డౌన్ సమాయంతో జనాలు బయటకు వస్తున్నారని, ఒక్కసారి లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత కూడా వ్యాధిపై అవగాహన ఉన్న వారు బయటకు రారని, అలాగే కొంతమంది భయంతో అయిన బయటకు రాకుండా ఉంటారని చెప్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేస్తే వ్యాధి పూర్తిగా పోయినట్టు కాదని, ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు తెలియజెప్పాలని నిపుణులు చెప్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత కూడా చైనా మళ్ళీ వ్యాధి ప్రబలిన విధానాన్ని ప్రజలకు తెలియచెప్పాలని, సోషల్ డిస్టెన్స్, మాస్క్ వాడటం, పరిశుభ్రత పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, సామూహిక కూటములు అప్పుడే అనుమతులు ఇవ్వకూడదని వైద్య నిపుణులు చెప్తున్నారు.