అక్రమ సంబధాలు ప్రాణాలు తీస్తున్నా జనం మారడం లేదు. మనం రోజూ వందల సంఖ్యలో ఇలాంటి వార్తలు వింటున్నా ఏమాత్రం మారకుండా అదే దారిలో నడిచి ప్రాణాలు పోగొట్టుకోవడమో లేక దగ్గరి వాళ్ళను దూరం చేసుకోవడమో జరుగుతూనే ఉంది. తాజాగా కడపలో అలాంటి ఘటనే జరిగింది. కడప నగరంలోని రాజారెడ్డి వీధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ళ స్వర్ణలత అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఏదో పని మీద బయటకి వెళ్లి ఇంటికొచ్చిన తల్లికి తన బిడ్డ ఉరికి వేళాడుతూ కనిపించింది.
కొన్నేళ్ళ క్రితం భర్త చనిపోవడంతో తనకు తెలిసిన ఒక యువకుడితో సదరు తల్లి వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకుంది. అయితే వివాహేతర సంబందానికి అడ్డోస్తోందన్న భావనతో ప్రియుడు తన కూతురిని హత్య చేసి ఇలా ఉరి వేసి చంపేసి ఉంటాడని ఆమె పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. తన కూతురు ఇలా ఉరి వేసుకునేంత పిరికిది కాదని తల్లి అంటోంది. ఇలా తప్పుడు పని చేయడం తప్పేనని, దానికి ఇంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అనుకోలేదని అంటోంది.