విదేశాల నుండి ఏపీకి 12,500 మంది..ఫోన్లు స్విచ్ ఆఫ్..!

-

దేశంలో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు.. శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. విదేశాల్లో ఈ వైరస్ కేసులు ఎక్కువగా నమోదవడంతో విమానాలపై ఆంక్షలు విధించారు. కాగా ఇప్పటికే డిసెంబర్ 1 తరవాత విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్ కు పన్నెండు వేల ఐదు వందల మంది వచ్చారని నివేదికలు చెబుతున్నాయి. అత్యధికంగా విశాఖ జిల్లాకు 1700 మంది విదేశాల నుండి వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్ అడ్రస్ తో విదేశాల నుండి వచ్చిన పన్నెండు వేల ఐదు వందల మందిలో తొమ్మిది వేల మంది అడ్రస్ ను అధికారులు సేకరించారు. మిగతా వారి కోసం సంప్రదించగా వారి నుండి ఎలాంటి స్పందన రావడం లేదు. ఫోను స్విచ్ ఆఫ్ చేయడంతో వారి వివరాలను అధికారులు స్వీకరించలేక పోతున్నారు. ఇక గుర్తించిన తొమ్మిది వేల మందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ దాంతో వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. విదేశాల నుండి ఏపీకి వచ్చిన వారు స్వచ్ఛందంగా వచ్చి కరోనా పరీక్షలు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news