మన దేశం రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ లో దారుణం గా పడిపోయింది. 16 నెలల కనిష్ట స్థాయి కి రూపాయి విలవ దిగ జారింది. గతంలో ఎన్నడూ లేని విధం గా 10 పైసలు బలహీనపడి 75.60 కు పడిపోయింది. కాగ మన దేశంలో ఈ మధ్య కాలం లో వేగం గా కరోనా కేసులు పెరుగుతుండడం.. అలాగే ప్రజలలో ఓమిక్రాన్ భయమే.. డాలర్ మారకం లో రూపాయి విలువ తగ్గడానికి కారణం అని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
అలాగూ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధులు బయటకు వెళ్లతుండటం కూడా ఒక కారణం అని భావిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లలో డాలర్ ప్రతిష్టత రోజు రోజు కు పెరుగుతుండటం కూడా ఒక కారణం అని చెబుతున్నారు. అయితే మన దేశం లో కరోనా కేసుల తో పాటు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పరిణామాలు పై రూపాయి ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అలాగే మన దేశంలో కి విదేశీ నిధుల రాక వంటి అంశాలు కూడా రూపాయి విలువ పై ఆధార పడి ఉంటుందని అంటున్నారు. అవి ఇలాగే కొనసాగితే రూపాయి విలువ మరింత పతనం అయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.