ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా, పార్టీలకు అతీతంగా, ఆన్ లైన్ వేదికగా జరుగుతున్న చర్చ ఇది! వైఎస్ జగన్ కి ఉన్న బాధ్యతలు ఏమిటి? చంద్రబాబుకు ఉన్న బాధ్యతలు ఏమిటి? ప్రస్తుతం ఎవరిపరిధిని వారు ఎలా నిర్ణయించుకున్నారు? వారే నిర్ణయించుకున్నారా.. ప్రజలు నిర్ణయించారా? జగన్ వ్యూహాత్మక ఎత్తుగడలు, బాబు వ్యూహాత్మక తప్పిదాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం!
తనకు గుంటూరు – విజయవాడలతో పాటు అమరావతిలోని 29గ్రామాలతో కలిపి 13 జిల్లాల అభివృద్ధి ముఖ్యం అనేది జగన్ చెబుతున్నమాట.. జనాల్లోకి బలంగా పంపుతున్న మాట! తనకు రాయలసీమ అభివృద్ధి ఎంత ముఖ్యమో.. కోస్తాంధ్ర అభివృద్ధి ఎంత ముఖ్యమో.. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంతే ముఖ్యం.. అంటే మూడు ప్రాంతాల సమిష్టి అభివృద్ధే తన లక్ష్యం అనేలా జగన్ అమరావతి విషయంలో తన మౌనంతో సంకేతాలు పంపుతున్నారు!
అయితే.. ఈ విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా జగన్ అడుగులు వేయడంతోపాటుగా… కేవలం అమరావతి ప్రాంతంలో మాత్రమే రాజధాని ఉండాలని.. ఆ ప్రాంతంతో ఆర్ధిక బంధాలు ఉన్న కొంతమందికో, కొంత ప్రాంతానికో, కొన్ని గ్రామాలకో మాత్రమే చంద్రబాబు ని పరిమితం చేసేలా స్కెచ్ వేశారు! చంద్రబాబు ఆ ఉచ్చులో ఇరుక్కున్నారు! ఫలితంగా… జాతీయస్థాయి నేతని గ్రామస్థాయి నేతను చేశారు జగన్!
నాయకుడు అనేవాడి ఆలోచన చలా వైడ్ గా ఉండాలని, సూక్ష్మం గా ఆలోచించకూడదని, స్వార్థాలు ఉండకూడదని, అన్ని ప్రాంతాలనూ సమానంగా చూడాలని, అన్ని కులాలను, అన్ని మతాలను ఒకేలా ట్రీట్ చేయాలని జగన్ చెప్పకనే చెప్పినట్లు అయ్యిందనేది ఈ సందర్భంగా విశ్లేషకులు చెబుతున్న మాట!!