కృష్ణా జిల్లాలోని చెవిటికల్లు ఇసుక రీచ్ లో వరద ఉధృతి పెరుగుతోంది. పులిచింతల , మున్నేరు నుండి ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోయింది.. దీంతో ఇసుక లోడింగ్ కోసం వెళ్లి వరదల్లో చిక్కుకుపోయాయి లారీలు. నది మధ్యలో లారీలు ఉండిపోయాయి. చెవిటి కల్లు రీచులోని కృష్ణా నదిలో ఏకంగా 132 లారీలు, 4 ట్రాక్టర్లు చిక్కుకున్నాయి.
ఉదయం 4 గంటల నుంచి మున్నేరుకు వరద ఉధృతంగా వచ్చింది. లారీలు వచ్చేందుకు ప్రయత్నించినా ర్యాంప్ తెగిపోవడంతో లారీలు ఒడ్డుకు చేరడం కష్టతరంగా మారిపోయింది. రీచ్ నిర్వహాణలో రీచ్ నిర్వాహాకులు, వరద అంచనా వేయడంలో అధికారుల వైఫల్యం స్పష్టం గా కనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. ఇక అటు నాటు పడవలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. లారీ డ్రైవర్లను క్షేమంగా బయటకు తీసుకు వచ్చారు పోలీసులు..అయితే.. ప్రస్తుతం వరద ప్రవాహం తీవ్రంగా ఉండటం తో లారీలు కొట్టుకు పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక అటు ఉన్నాతాధికారులు పరిస్థితులను ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు.