ఘోర రోడ్డు ప్రమాదం..14 మంది స్పాట్ లోనే మృతి

ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌ ఘర్ లో గురువారం రాత్రి పోద్దుబోయక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  కుండా నుంచి ప్రయాగ్‌రాజ్‌ వైపు వేగంగా వెళుతున్న ఓ బొలెరో వాహనం నిలిపి ఉన్న ట్రక్కును డీ కొనడంతో ఆరుగురు పిల్లలతో సహా పద్నాలుగు మంది మరణించినట్లు సమాచారం. బొలెరో లో ఉన్న 14 మంది అక్కడికక్కడే మరణించారని చెబుతున్నారు.  మణిక్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ప్రయాగ్రాజ్-లక్నో హైవేపై ఒక ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

ఇక ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన విచారం వ్యక్తం చేశారు. అలాగే అక్కడికి చేరుకుని సాధ్యమైనంత త్వరగా సహాయ సహకారాలు అందించాలని సీనియర్ అధికారులను ఆయన ఆదేశించారు. ప్రమాద తీవ్రతను చూసి ఎవరూ మృతదేహాలను వెలికి తీసేందుకు ముందుకు రాలేదని స్థానికులు పేర్కొన్నారు. ఆ తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని కట్‌ చేసి మృతదేహాలను బయటకు తీశారు. బాధితులు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు.